బ్యాడ్ లక్ అంటే మిల్కీ బ్యూటి తమన్నాది అనే చెప్పాలి. బాహుబలి 1 సినిమాలో ముందులో పెద్దగా రోల్ లేకపోయినా కూడా.. అవంతిక పాత్రకు సినిమా లెంగ్త్ పెంచడానికి బాగా వాడుకున్నాడు రాజమౌళి. ఆ విధంగా అమ్మడి బుట్టలో రెండు పాటలు కూడా వచ్చి పడ్డాయ్. దానితో ఏకంగా మిల్కీ బ్యూటి ఒక్కసారిగా కొత్త పాపులార్టీ తెచ్చుకుంది.
ఇక బాహుబలి 2 లో రోల్ కోసం గుర్రపు స్వారీలు కత్తి యుద్దాలు కూడా నేర్చుకుంది. కాని చివరకు సినిమాలో.. ప్రభాస్ కు అన్నం తినిపించే ముసలావిడ కనిపించినంత సేపు కూడా కనిపించలేదు. దానికి ఒక కారణం ఉందట. వాస్తవానికి ప్రభాస్ అండ్ రానా తాలూకు వార్ సీన్లు ఒక కంపెనీ చేయగా.. మధ్యలో తమన్నా పోరాటాలు వాటిలో ఇరికించి యాడ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే హీరో అండ్ విలన్ సీన్లు ముందే తీసేశారు. తమన్నాను యాడ్ చేసే గ్రాఫిక్స్ వేరే కంపెనీ చేసింది. కాకపోతే యాడ్ చేసిన సీన్లను చూస్తే.. వాటిలో గ్రాఫిక్స్ బాలేదట. అందుకే రాజమౌళి నిర్దాక్షణ్యంగా ఆ పార్టును కత్తిరించిపాడేశాడు. దెబ్బకి తమన్నా సీన్స్ అన్నీ దాదాపు లేచిపోయాయ్.
ఇప్పుడు తమన్నా పాత్ర కోసం చూస్తే.. తన సినిమా ఔట్పుట్ కు బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి తమన్నా పాత్ర పోయినా పర్లేదు కాని.. ఆడియన్స్ ఎక్కడా కూడా విజువల్ ఫీల్ ను మిస్సవ్వకుండా చూసుకున్నాడు జక్కన్న. తప్పులేదు.
No comments:
Post a Comment